బమ్మెర పోతన

public profile

Is your surname బమ్మెర?

Research the బమ్మెర family

బమ్మెర పోతన's Geni Profile

Share your family tree and photos with the people you know and love

  • Build your family tree online
  • Share photos and videos
  • Smart Matching™ technology
  • Free!

పోతన్న బమ్మెర

Also Known As: "bammera pOtana"
Birthdate:
Birthplace: Bammera Village, Jangaon Dis, Bommera, Warangal, TG, India
Death: 1510 (59-61)
Immediate Family:

Son of కేసన మంత్రి and లక్కమాంబ
Father of మల్లయ బమ్మెర
Brother of తిప్పన్న

Managed by: Private User
Last Updated:

About బమ్మెర పోతన

పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభధృండట నే
పలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేల
--- బమ్మెర పోతన్న
---

బమ్మెర పోతన వంశం పోతనప్రణీత భాగవతం 1 పే44-49
---

బమ్మెర పోతన్న భాగవతాన్ని సంపూర్ణంగా రచించాడు. తనకి అంకితం చెయ్యలేదన్న కోపంతో సింగయ భూపాలుడు ఆ గ్రంధాన్ని పాతిపెట్టించాడు. అందువలన 5-6-11-12 స్కందాలలో కొన్ని భాగాలు శిధిలమై నష్టమయాయి. పంచమ స్కందాన్ని గంగన్న బొప్పరాజు, షష్టమ స్కందాన్ని ఏర్చూరు సింగయ్య, ఏకాదశ ద్వాదశ స్కందాలు వెలిగందల నారయ్య పూరించారు. వీరందరు పోతన్న శిష్యులే.
---

కేసన మంత్రి-లక్కమాంబ పుత్రుడు బమ్మెర పోతన జీవితకాలం 1450-1510 అని చెప్పబడుచున్నది. ఇతని పుత్రుడు బమ్మెర మల్లయ. బమ్మెర పోతన భాగవతాన్ని సంపూర్ణంగా రచించాడు. బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. సింగయ భూపాలుడు తనకి అంకితం చెయ్యలేదన్న కోపంతో ఆ గ్రంధాన్ని పాతి పెట్టించాడు. అందువలన 5-6-11-12 స్కంధాలలో కొన్ని భాగాలు శిథిలమై నష్టమయాయి. పంచమ స్కంధాన్ని బొప్పరాజు గంగన్న, షష్టమ స్కంధాన్ని ఏర్చూరు సింగయ్య, ఏకాదశ ద్వాదశ స్కంధాలు వెలిగందల నారయ్య పూరించారు. వీరందరు పోతన్న శిష్యులే. వీరందరు ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. పోతన రచనా శైలి, భక్తి భావం, పద్యాలలోని మాధుర్యం తెలుగు నాట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదహరించబడుతున్నాయి, వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక రోజు గోదావరి నదిలో స్నానానంతరం ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసుడు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తి చేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. బమ్మెర పోతన రచనలు - వీరభద్ర విజయం, భోగినీ దండకం, శ్రీ మదాంధ్రభాగవతం, నారాయణ శతకం. కడప జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి ఆలయ సమీపంలో కల ఒక చిన్న గుట్టపై పోతన విగ్రహం ఉంది. స్వామివారికి పోతన పేర తాంబూలం సమర్పించే ఆచారం ఉంది.

పోతన, శ్రీనాథ కవి సార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉన్నా, వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి. శ్రీనాథుని బావమరిది దగ్గుపల్లి పోతనను బమ్మెర పోతనగా పొరపడుతుంటారు.
---

view all

బమ్మెర పోతన's Timeline

1450
1450
Bammera Village, Jangaon Dis, Bommera, Warangal, TG, India
1510
1510
Age 60
????