నాకు మా అమ్మ గారు నాన్న గారు చెప్పిన దాని ప్రకారం అజ్జరపు ఇంటిపేరు పశ్చిమ గోదావరి జిల్లా లోని తణుకు తాలుక లోని పెరవలి మండలం లో వుంది. మేము అజ్జరం అజ్జరపు వారము. బంధువులు ఎక్కువగా ఉండుటచేత శుభ కార్యాలకు ఎక్కువగా అడ్డంకులు అవి వస్తుండటం వలన చాలా ఇంటి పేర్ల వాళ్ళు విడిపోయి వేర్వేరు ప్రదేశాలకు వలస వెళ్ళారని కొంతమంది పెద్దలు చెప్పటం వలన తెలిసింది. అ విధంగా అజ్జరం, పెరవలి, దేవరపల్లి అజ్జరపు వారిగా స్థిరపడ్డారు అని నాకు తెలిసిన సమాచారం. ఇది నిజమో కాదో తెలియదు. బహుశా ఇదే నిజమయి ఉండవచ్చు.