దస్రుడు

public profile

Share your family tree and photos with the people you know and love

  • Build your family tree online
  • Share photos and videos
  • Smart Matching™ technology
  • Free!

About దస్రుడు

సత్వుడు -- దస్రుడు లను అశ్వినీదేవతలు అందురు.
---

దస్రుడు అవతారం -- ద్వివిదుడు
---

సూర్యుడు-సంజ్ఞ (రాఙ్ఞి) అశ్వ రూపంలో కలిసినపుడు జన్మించిన కవలలు సత్వుడు; దస్రుడు (వీరిని అశ్వినీ దేవతలు అందురు). వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు.

చ్యవన మహర్షి భార్య సుకన్య పాతివ్రత్య ధర్మాన్ని గుర్తించి, వృధ్ధుడైన చ్యవనుడుని నవ యవ్వనవంతుడుగా చేస్తారు. చ్యవనుడు వారికి యజ్ఞయాగాదులలో సోమరసం పానం చేకూర్చి, దేవతలతో సమానత్వం కల్పించాడు.

ఇంద్రుడు అనేక మహా అస్త్రాలను, బ్రహ్మవిద్యను దధీచికి నేర్పి, వీటిని మరెవ్వరికీ నేర్పరాదని నిబంధన విధించాడు. అలా నేర్పితే దధీచి శిరస్సును ఖండిస్తానని స్పష్టం చేశాడు. అశ్వినీ దేవతలు దధీచిని ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్పవలసిందిగా కోరారు. దధీచి అందుకు అంగీకరించాడు. శస్త్రవిద్యా నిపుణులు, దేవ వైద్యులు, చతురులు అయిన వారు దధీచి తలను స్వయంగ ఖండించి, ఆ స్థానంలో ఒక అశ్వం శిరస్సు నుంచి, శాస్త్రాలనధ్యయనం చేశారు. విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దధీచి అశ్వ శిరస్సును ఖండించాడు. అశ్వనీ దేవతలు తాము భద్రపరిచిన దధీచి నిజ శిరస్సును తిరిగి స్వస్థానంలో అతికించారు.

రామాయణంలో వానర వీరులు, సుషేణుడు పుత్రులైన మైందుడు, ద్వివిదుడు వీరి అవతారాలు. మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి అశ్వినీ దేవతల వలన నకులుడు, సహదేవుడు జన్మించారు.
---