మల్లన పావులూరి

public profile

Is your surname పావులూరి?

Research the పావులూరి family

మల్లన పావులూరి's Geni Profile

Share your family tree and photos with the people you know and love

  • Build your family tree online
  • Share photos and videos
  • Smart Matching™ technology
  • Free!

మల్లన పావులూరి

Birthdate:
Death:
Immediate Family:

Son of శివన్న పావులూరి and గౌరమ్మ పావులూరి

Managed by: Private User
Last Updated:

About మల్లన పావులూరి

పావులూరి మల్లన కాలం 11 వ శతాబ్దం. ఇతను నన్నయ కాలం నాటి వాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. మల్లన తల్లిదండ్రులు శివన్న, గౌరమ్మలని, మల్లయామాత్యుని పౌత్రుడని ఇతని రచనల ద్వారా తెలుస్తోంది. గోదావరి మండలంలో పావులూరి గ్రామానికి మల్లన కరణంగా ఉండే వాడట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకునే కాలంలో గణిత శాస్త్ర నియమాలను పద్యంలో పొందుపరచడం ఇతని ద్వారా సాధ్యమయిందని తెలుస్తుంది.

సంస్కృత పండితుడు మహావీరాచార్య (9వ శతాబ్దం) రచించిన గణితసార సంగ్రహ గ్రంధాన్ని సంగ్రహించి తెలుగులో సార సంగ్రహ గణితము అను పేరుతో అనువదించాడు. దీనికి పావులూరి గణితము అని కూడా పేరు. ఇది సంస్కృతం నుండి ప్రాంతీయ భాషలోకి గణిత శాస్త్ర గ్రంథం యొక్క తొలి అనువాదం మరియు తెలుగులో వ్రాయబడిన పురాతన శాస్త్రీయ గ్రంథం. మూలం ఆ సంస్కృత గ్రంథం అయినా లెక్కలన్నీ మల్లన్న స్వయంగా వేసుకున్నావే. వ్యర్ధ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంథాన్ని ఇమడ్చడం ఇతని ప్రతిభకు సూచిక. మల్లన తన రచనలో ఆ యుగంలో ఆంధ్రాలో ఉపయోగించిన తూనికలు, కొలతలు మరియు నాణేల వ్యవస్థను కూడా వివరించాడు. ఇతని రచనలో కవి స్తుతి, పరిచయం వంటివి లేవు. మల్లన్న రచనల వలన ఆనాటి జనం తర్క, వ్యాకరణ, గణిత, ఖగోళ, భూగోళ విషయాలలో ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది.
---

view all

మల్లన పావులూరి's Timeline