అల్లసాని పెద్దన

public profile

Is your surname అల్లసాని?

Research the అల్లసాని family

అల్లసాని పెద్దన's Geni Profile

Share your family tree and photos with the people you know and love

  • Build your family tree online
  • Share photos and videos
  • Smart Matching™ technology
  • Free!

పెద్దన అల్లసాని

Also Known As: "పెద్దనామాత్యుడు"
Birthdate:
Birthplace: Anantapur, Anantapuram, AP, India
Death: 1575 (144-146)
Immediate Family:

Son of చొక్కన అల్లసాని

Managed by: Private User
Last Updated:

About అల్లసాని పెద్దన

అల్లసాని పెద్దన 15వ శతాబ్దము వాడు (1430-1575). శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానములొ పేరు గాంచిన అష్ట దిగ్గజములలో ఒకడు. అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించి, ప్రస్తరించి ఒక అపూర్వ కళాఖండాన్ని - మనుచరిత్ర - శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత కచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. మనుచరిత్రలోని కవితాశిల్పం అద్వితీయం. అక్షరాలా పెద్దన ఆంధ్ర ప్రబంధ కవితా పితామహుడే. మనుచరిత్రలో అనేక ఇతివృత్తాలున్నా గాని అందరినీ అలరించి పెద్దనకు కీర్తి తెచ్చిపెట్టినది వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టమే. వరూధిని ప్రవరాఖ్యుల కథ స్వారోచిష మన్వంతరమునకు చెందినది. దీని కథనమే అల్లసాని పెద్దనామాత్యుడు రచించిన మను చరిత్ర.

ఈ ప్రబంధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదిగా చెపుతారు.

శ్రీ కృష్ణదేవరాయలు ఇతడిని ఆంధ్ర కవితా పితామహుడు అను బిరుదుతో సత్కరించారు. ఇతని పద్య రచన అల్లసాని వారి అల్లిక గజిబిజి అని తెనాలి రామలింగడిచే చెప్పబడినది. హరికథా సారము, రామస్తవరాజము, అద్వైత సిద్ధాంతము, చాటు పద్యాలు మొదలైన ఇతని రచనలు ప్రస్తుతం అలభ్యం. ఇతను కవి మాత్రమే కాక రాచ కార్యాలలో కూడా రాయల వారికి సలహాలు ఇచ్చే వాడు . అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.
---

వరూధిని ప్రవరాఖ్యుల కథ
కాశీ నగరం దగ్గర అరుణాస్పద పురము అనే గ్రామములో ప్రవరాఖ్యుడు‌ అనే పరమ నిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య సోమిదమ్మి ఎంతో అనుకూలంగా వుండే వారు. ఒక నాడు వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు మంచు కరిగి దానితో పాదములకున్న పసరు కరిగి వెళ్ళుటకు అశక్తుడైనప్పుడు చింతించును,

తిరుగు ప్రయాణమునకు మార్గం గాన రాక ఒక ఉపాయం‌ కోసం చూస్తున్న ప్రవరుడిని చూసి వరూధిని అనే గంధర్వ కన్య మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించాడు. అగ్ని దేవుని ప్రార్ధించి తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని, ఆమెపై మనసుపడిన కల అనే గంధర్వుడు, ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు.

కల అనే గంధర్వుడు - వరూధినిలకు పుట్టిన కోటి సూర్య ప్రకాశముకలిగిన పుత్రుడు స్వరోచి.

స్వరోచి పుత్రుడు ద్యుతిమంతుడు = స్వారోచిషుడు అను 2వ మనువు.

మిగిలిన వివరణకు మనువు - 2 ద్యుతిమంతుడు చూడుము.
---

కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలు

అల్లసాని పెద్దన --- ముక్కు తిమ్మన --- ధూర్జటి --- మాదయ్యగారి మల్లన --- అయ్యలరాజు రామభద్రుడు --- పింగళి సూరనామాత్యుడు --- భట్టుమూర్తి --- తెనాలి రామకృష్ణ
---

view all

అల్లసాని పెద్దన's Timeline