తిక్కన సోమయాజి

public profile

Is your surname కొట్టరువు?

Connect to 44 కొట్టరువు profiles on Geni

తిక్కన సోమయాజి's Geni Profile

Share your family tree and photos with the people you know and love

  • Build your family tree online
  • Share photos and videos
  • Smart Matching™ technology
  • Free!

తిక్కన సోమయాజి కొట్టరువు

Also Known As: "tikkana"
Birthdate:
Death: circa 1288 (74-91)
Immediate Family:

Son of కొమ్మన కొట్టరువు and అన్నమయ కొట్టరువు
Father of కొమ్మన కొట్టరువు

Managed by: Private User
Last Updated:

About తిక్కన సోమయాజి

తిక్కన వంశం - కవిత్రయ విరాట పర్వం - పీఠిక - నుంచి గ్రహించబడినది.

నన్నయ మహాభారతం రచన క్రీ.శ 1055లో ప్రారంభమైనట్లు సిధ్ధాంతము. అతను ఆదిపర్వం, సభాపర్వం మరియు అరణ్యపర్వం 141వ పద్యం వరకు రచించినాడు.

200 ఏళ్ళ తరువాత, తిక్కన సోమయాజి విరాటపర్వం నుంచి మొదలు మిగిలిన 15 పర్వాలు పూర్తిచేసాడు.

పిమ్మట కవి బ్రహ్మ ఎర్రన 14వ శతాబ్దం పూర్వార్ధంలో అరణ్యపర్వం శేషాన్ని (142వ పద్యం మొదలు) పూరించాడు.

అందువలన మహాభారతం రచన తెలుగులో పూర్తికావడానికి 3 శతాబ్దాల కాలం పట్టినది, ముగ్గురు కవులు చేపట్టి నిర్వహించవలసి వచ్చినది.

TTD ప్రచురించిన 4వ సంపుటము అరణ్యపర్వం పూర్వార్ధము - నన్నయ విరచితము. 5వ సంపుటము అరణ్యపర్వం ఉత్తరార్ధము ఎర్రన విరచితము.
---

కొట్టరువు కొమ్మన-అన్నమయ పుత్రుడు - కొట్టరువు తిక్కన. ఇతడు కవిత్రయంలో రెండవ వాడు. ఇతని పుత్రుడు కొమ్మన. తిక్కన లేదా తిక్కన సోమయాజి జీవితకాలం 1205-1288 అని చెప్పబడుచున్నది. తిక్కన విక్రమ సింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. తిక్కన మొదటి రచన నిర్వచనోత్తర రామాయణం అను పద్య రచన. ఈ గ్రంథమును రచించినా ముగించలేదు. మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. మనుమసిద్ధి దాయాదుల వలన రాజ్యం కోల్పోగా, తిక్కన, అప్పుడు ఓరుగల్లుని పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి, ఆయన సాయముతో మనుమసిద్ధిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించాడు.

అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవి మిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి. నన్నయ మొదలుపెట్టిన మహాభారత రచన 200 ఏళ్ళ తరువాత, తిక్కన విరాటపర్వం నుంచి మొదలు మిగిలిన 15 పర్వాలు పూర్తిచేశాడు. అరణ్యపర్వమును ఆంధ్రీకరించుట చేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టాడు అని కొందరు అంటారు. నన్నయవలె తన గ్రంథమును మూలమునకు సరిగా వ్రాయలేదు. విరాటపర్వమునందు కథ కొంత పెంచెను. తక్కిన పర్వములయందు కథను సంగ్రహపరచెను. తిక్కన భారతమును మనుమసిద్ధికి ఇవ్వక శ్రీ భద్రాద్రి రాముడికి అంకితమిచ్చాడు. తిక్కన మనుమసిద్ధి రాజ్యము అంతరించిన తరువాత కూడా చిరకాలము జీవించి, సర్వజనులచే గౌరవించబడినాడు. మూల ఘటిక కేతన తిక్కన శిష్యుడు. కేతన (మూల ఘటిక కేతన) తను రచించిన దశకుమార చరిత్రము అను గ్రంథమును తిక్కనకి అంకితం చేసి, అందులో తిక్కన వంశము, తిక్కన (తిక్కన సోమయాజి) రూపాన్ని సమగ్రముగా వర్ణించాడు.
---