మల్లికార్జున పండితారాధ్యులు

public profile

మల్లికార్జున పండితారాధ్యులు's Geni Profile

Share your family tree and photos with the people you know and love

  • Build your family tree online
  • Share photos and videos
  • Smart Matching™ technology
  • Free!

మల్లికార్జున పండితారాధ్యులు

Birthdate:
Death: circa 1180 (51-68)
Immediate Family:

Son of భీమన పండితులు and గౌరాంబ

Managed by: Private User
Last Updated:

About మల్లికార్జున పండితారాధ్యులు

మల్లికార్జున పండితారాధ్యులు (1120 – 1180) 12 వ శతాబ్దానికి చెందిన కవి, దక్షారామ శ్రీ భీమేశ్వరస్వామివారి అర్చకులైన భీమన పండితులు, గౌరాంబలకు జన్మించినాడు. కోటిపల్లి ఆరాధ్య దేవరగారు వీరి దీక్షా గురువులు. కర్ణాటకలో శ్రీ బసవేశ్వరులు ప్రబోధించిన వీరశైవమును వీరు శ్రుతి స్మృతి పురాణేతిహాసాది ప్రమాణములతో ప్రతిపాదించినాడు. వీరు వీరభద్రావతారమని వీర శైవులు విశ్వసిస్తారు. పండితారాధ్యులు పరమశివ పూజా దురంధరులు; జంగమార్చనాశీలురు. శాపానుగ్రహసమర్థులు.

ఇతడు లింగోద్భవదేవ గద్యము, అక్షరాంక గద్యము, పర్వత వర్ణనము, హరలీల, అమరేశ్వరాష్టకము, రుద్రమహిమ, బసవ మహిమ మొదలగు అనేక కృతులను రచించినప్పటికీ నేడు శివతత్త్వసారము, గణసహస్రనామస్తవము మాత్రమే లభ్యమవుతున్నాయి.

శ్రీమల్లికార్జున పండితారాధ్యులు శివకవిగా, కవిమల్లునిగా ప్రసిద్ధి చెందినారు.

పాల్కురికి సోమనాథుడు, నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యులు.వీరిని శివ కవిత్రయం అందురు.